హైదరాబాద్‌ అభివృద్ధికి కేటీఆర్ కృషి భేష్: ఓవైసీ

89
owaisi akbaruddin

హైద‌రాబాద్ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నార‌ని తెలిపారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ….మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు.

హైద‌రాబాద్ అభివృద్ధికి కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ప‌ని చేస్తుంద‌ని… గ‌చ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో జ‌రిగిన అభివృద్ధిలో కేటీఆర్ కీల‌క పాత్ర పోషించార‌ని వెల్లడించారు. ఇటీవ‌ల గచ్చిబౌలి వెళ్లిన‌ప్పుడు ఆ ప్రాంతాన్ని చూసి షాక్ అయ్యానని తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు…ఎంఐఎం పార్టీ బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తుందన్నారు.భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌ల్పించేందుకు కొత్త రెవెన్యూ చ‌ట్టం ఉపయోగపడుతుందని వెల్లడించారు.