‘పుష్ప‌’ నుండి రానున్న రష్మిక ఫస్‌ లుక్..

39
Rashmika Mandanna

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా పుష్ప‌. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ సాంగ్ చిత్రీకరణలో ఉంది. అడవి నేపథ్యంలో నడిచే ఈ కథలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందనే ఒక టాక్ వచ్చింది. కాగా, రేపు రష్మి ఫస్టులుక్‌ను వదలడానికి రంగం సిద్ధమైంది.

సెప్టెంబర్ 29 ఉదయం 9.45 నిమిషాలకు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఒక ప్రకటనను రిలీజ్‌ చేశారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా షూట్ సెప్టెంబ‌ర్ ఆఖ‌రు వ‌ర‌కు పూర్తి చేసి క్రిస్ట‌మ‌స్ కు రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ ఇప్పుడున్న స్టేట‌స్ ప్ర‌కారం క్రిస్ట‌మ‌స్ కు సినిమా రిలీజ్ చేయ‌టం ఆసాధ్య‌మ‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.