ఫ్యాన్స్‌ కి ఉగాది గిఫ్ట్‌ ఇస్తున్న హీరో..

229
- Advertisement -

ఈ ఉగాదికి నాగచైతన్య తన ఫ్యాన్స్‌ కి అదిరిపోయో గిఫ్ట్‌ ఇవ్వనున్నాడు.  ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి రెండు వరుసగా హిట్లతో హ్యాపీగా ఉన్న చైతూ..చాలా గ్యాప్‌ తర్వాత  ప్రేక్షకులను పలకరించనున్నాడు.

ఇప్పుడు నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్న నాయాన’ లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు నాగ చైతన్యను కూడా పూర్తి రొమాంటిక్ యాంగిల్ లో చూపించనున్నాడు.  అయతే నాగ చైతన్య ఇంతకు ముందులా కాకుండా తన నటనలోనూ , బాడీ లాగ్వేజ్ లోనూ పూర్తిగా స్టైల్ మార్చేయనున్నాడట.  దీంతో చైతు సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా ఉత్సుకత కాస్త ఎక్కువైంది
First look of Chaitu's movie for Ugadi!
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈ మార్చి నెల 29న  ఉగాది సందర్బంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే అన్నపూర్ణ స్యుడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్‌ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ప్రస్తావనలో ఉందట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు సైతం ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకులను అందించాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు అక్కినేని టీమ్.

- Advertisement -