దర్శకురాలిగా మారనున్న నిత్యా..?

153

తెలుగు,తమిళ్‌…మలయాళ చిత్ర పరిశ్రమలో నిత్యామీనన్‌ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకుల మనస్సు దోచుకుంటుంది.తను నటించిన చిత్రలు మంచి విజయలే సాదించాయి. మరి ఈ ముద్దుగుమ్మ కొంత కాలంగా తెరపై కనిపించకపోవడంతో సిని పరిశ్రమలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నిత్యా సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం.. తనకు సరైన ఆఫర్స్‌ రావడం లేదని, రోటీన్‌ పాత్రలే వస్తున్నాయని,మంచి కథ కోసం ఎదురుచూస్తుందని సిని వర్గలు గుస గుసలు. కాని అసలు కారణం.. తను కొద్ది కాలం వరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిత్యా నిర్ణయించుకుందాట.

Nithya Menon Wants to become a Director

మరి నిత్యామీనన్‌ ఆ నిర్ణయానికి కారణం ఏమిటనేగా అసలు సందేహం… దర్శకత్వంపై ఆమెకి గల ఆసక్తే అందుకు కారణం అని చెబుతుంది. దర్శకత్వంపై ఆసక్తితో కొంతకాలంగా ఆమె రెండు కథలను సిద్ధం చేస్తూ వచ్చిందట. ఈ రెండు కథలలో ఒక దానికి నిర్మాత కూడా దొరికాడని అంటున్నారు. త్వరలోనే ఆ కథతో ఆమె సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. నటిగా అందరి ఆదరణ పొందిన నిత్యామీనన్, దర్శకురాలిగా కూడా శభాష్ అనిపించుకుంటుందేమో చూడాలి మరి