అందరిలాగే.. పవన్‌ చూపు డబ్బు వైపు..?

160

సినిమా వేదికలైనా..రాజకీయ వేదికలైనా పవన్‌ తన వద్ద ఉన్న డబ్బు గురించి ప్రస్థావిస్తుంటాడు. తన దగ్గర డబ్బుల్లేవని, ఆ మధ్య కూడా ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వల్ల డబ్బులేమీ రాలేదని.. ఈసారి కొంచెం గట్టిగా సినిమా చూడండని అన్నాడు పవన్. అయితే ఇలా పదే పదే డబ్బుల గురించి పవన్‌ ఎందుకు మాట్లాడుతున్నాడని ఫ్యాన్స్‌ కూడా  అనుమానంగానే ఉన్నారు.
Tollywood star Pawan Kalyan in remake movies
అయితే  ‘సర్దార్..’ వల్ల బయ్యర్లు నష్టపోయారు కానీ.. పవన్ అండ్ కో నష్టపోయిందేమీ లేదని.. ఈ చిత్రానికి తక్కువలో తక్కువ రూ.50 కోట్ల దాకా మిగిలిందని అంటారు. ఇప్పుడు పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’కు రూ.70 కోట్ల దాకా టేబుల్ ప్రాఫిట్ అంటున్నారు. నిజానికి ‘కాటమరాయుడు’ సినిమా మొదలైనపుడు అందరూ చాలా నెగెటివ్‌గా మాట్లాడారు. పోయి పోయి ‘వీరం’ లాంటి మామూలు సినిమాను.. పైగా తెలుగులో కూడా రిలీజైన చిత్రాన్ని రీమేక్ చేయడమేంటి అన్నారు. కాని అందరికి షాక్‌ ఇస్తూ సంచలనాలు సృష్టిస్తోంది కాటమరాయుడు.
 Tollywood star Pawan Kalyan in remake movies
కానీ అలాంటి సినిమాతో కూడా రూ.70 కోట్ల ప్రాఫిట్ చూపించగలిగాడు పవన్. దీని తర్వాత పవన్ ‘వేదాలం’ చిత్రం రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు. తాజాగా ‘తెరి’ రీమేక్ కూడా తెరమీదికి వచ్చింది. ఈ చిత్రం కూడా ఆల్రెడీ తెలుగులో రిలీజైనా అదేమీ పట్టనట్లు రీమేక్‌కు రెడీ అయిపోతున్నాడు పవన్. పవన్ తీరు చూస్తుంటే రీమేక్‌లతో కాసుల పంట పండించుకునే కనికట్టు పట్టేసినట్లుగా అనిపిస్తోంది.

పవన్‌తో స్ట్రెయిట్ మూవీ అంటే అంత సులువుగా వర్కవుట్ కావట్లేదు.  అదే రీమేక్ అయితే వేగంగా స్క్రిప్టు రెడీ అయిపోతుంది. సినిమా త్వరగా పూర్తయిపోతుంది. బిజినెస్ విషయంలో ఢోకా ఉండదు. ప్రూవ్డ్ సబ్జెక్టు కాబట్టి మినిమం గ్యారెంటీ అన్న భరోసా ఉంటుంది. ఈ కోణంలో చూస్తే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇదో మార్గం అయిపోయినట్లుగా ఉంది. అందుకే ఎన్నికల బరిలో దిగేముందు సాధ్యమైనంత ఎక్కువ సినిమాలు చేసి కాసులు రాబట్టుకునే ప్రయత్నంలో పవన్ వరుసగా రీమేక్స్ మీద దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోంది.