బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే 9 రోజులయ్యింది. హౌస్ మెట్స్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఇక మొదటి వారం ఎలిమినేషన్ లో భాగంగా హేమ బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయింది. ఇక నెక్ట్స్ వీక్ ఎలిమినేషన్ లో మొత్తం 8మంది సభ్యులు ఉన్నారు. ఇక నిన్న జరగిన ఎపిసోడ్ లో ఇంట్లో వాటర్ , గ్యాస్ రాకపోవడంతో సభ్యులకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఇంట్లో వాటర్ , నీళ్లు రావాలంటే మూడు సైకిళ్లను తొక్కి వాటర్ ను సేవ్ చేసుకోవాలి అని చెప్పారు. ముగ్గురు సైకిల్ తొక్కుతుంటే మిగతా వారు వేరే పనులు చేసుకుంటు ఉండాలి. ఇకపోతే కిచెన్ లో అందరికి దోసెలు వేస్తుంది వితిక. టిఫిన్ తినడం అయిపోయాక కొంచెం టాస్క్ లో పాల్గోను అని వితిక కు చెప్పింది పునర్ణవి.
దీంతో కాసేపు వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అక్కడే ఉన్న వరుణ్ సందేశ్ తన భార్య వితికకు కాకుండా పునర్నవికి సపోర్ట్ చేయడంతో వితిక తట్టుకోలేకపోయింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగిన తర్వాత వితిక గుక్కపట్టి ఏడ్చింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇది చూసి తట్టుకోలేకపోయిన వరుణ్ ఆమె చేతిలో చేయి వేసి క్షమించమని కోరాడు.