యాదాద్రిలో మహా సుదర్శన యాగం

386
cm kcr Chinajiyar Swamy
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో భారీ యాగాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లో ఈ యాగాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈయాగం నిర్వహించనున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈసందర్భంగా యాగానికి సంబంధించిన పలు అంశాలపై వీరివురు చర్చించారు. సుమారు వంద ఎకరాల యజ్ఞవాటికలో 1,048 యజ్ఞగుండాలతో యాగం నిర్వహించనున్నారు.

mp Santhosh kumar blessings Chinajiyar Swamy

3 వేల మంది రుత్విక్కులు, మరో 3 వేల మంది సహాయకులతో యాగం నిర్వహించబోతున్నారు. కేవలం దేశంలోని మఠాధిపతులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపనున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలను, అలాగే బద్రినాథ్‌, శ్రీరంగం, జగన్నాథ ఆలయం, తిరుమల లాంటి క్షేత్రాల నుంచి మఠాధిపతులను ఈ యాగానికి ఆహ్వానించబోతున్నారు.

ఈ మహాసుదర్శనయాగంపై దాదాపు 3 గంటల పాటు చినజీయర్‌తో చర్చించారు కేసీఆర్. అయితే ఈయాగానికి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై చర్చించారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మైం హోం రామేశ్వర్ రావులు ఉన్నారు. త్వరలోనే ఈయాగానికి సంబంధించిన తేదీలను కూడా ప్రకటించనున్నారు.

- Advertisement -