కన్నడ హీరో యష్ తో పూరీ జగన్నాథ్ జనగణమన..

371
Yash puri
- Advertisement -

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో చాలా ఆనందంగా ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా ఫెయిల్యూర్స్ ను చూసిన పూరీ ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరో వైపు రామ్ కెరీర్ లో కూడా ఇంత పెద్ద హిట్ ఎప్పుడు రాలేదు. ఈసినిమా విజయం ఇద్దరికి కీలకంగా మారింది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఈసినిమా సక్సెస్ టూర్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. హీరో రామ్ ఫారిన్ ట్రిప్ నుంచి మరో రెండు రోజుల్లో రానుండటంతో పెద్ద ప్రొగ్రామ్ ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. అయితే పూరీ జగన్నాథ్ తన తరువాతి సినిమా ఎవరితో తీస్తాడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

పూరీ జగన్నాథ్ మహేశ్ బాబుతో జనగణమన సినిమా చేద్దామని ఎప్పటి నుంచో ఎదురుచూస్తుండగా ఆయన రిజెక్ట్ చేశాడు. దీంతో పూరీ ఇప్పుడు అదే సినిమాను కన్నడ హీరో యష్ తో తీసేందుకు ప్రయత్నిస్తున్నారట. పూరీ జగన్నాథ్ త్వరలోనే యష్ కలిసి స్టోరీ చెప్పనున్నారని తెలుస్తుంది.

- Advertisement -