డిసెంబర్‌ 1 నుంచి FASTag..ప్రయోజనాలివే..!

690
fastag
- Advertisement -

డిసెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకురానుంది. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు డిజిటలైజ్డ్ ఫాస్ట్ ట్యాగ్ (FASTag)ని తీసుకురాబోతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూను తొలగించేందుకు FASTag వ్యవస్థ ఎంతో సహాయపడుతోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారుల్లో ప్రయాణించే వారికి ఇది తప్పనిసరి కానుంది.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC) విధానంలో టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. FASTag లేకుండా రాకపోకలు సాగిస్తే చెల్లించాల్సిన దాని కంటే డబుల్ కట్టాల్సి వస్తుంది. ఉంటే మాత్రం పాత ఛార్జీలే వర్తిస్తాయి.

కొత్తగా కొనుగోలు చేసిన కార్లు ఇప్పటికే FASTag అమర్చబడి ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ పాతకారును ఉపయోగిస్తుంటే మాత్రం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, పేటీఎం,అమెజాన్ నుంచి ఈ ట్యాగ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

FASTag కావాలంటే పైన పేర్కొన్న బ్యాంకుల్లో వాహనం ఆర్సీ, గుర్తింపు కార్డు జిరాక్సులు రెండు సెట్లు, ఓ పాస్ పోర్టు సైజు ఫోటో, ఛార్జ్ చెల్లించాలి. గుర్తింపు కార్డు అంటే ఆధార్ లేదా పాన్ లేదా ఓటరు కార్డు వంటివి ఉపయోగించవచ్చు.

()ఈజీ పేమెంట్. టోల్ ట్రాన్సాక్షన్స్ కోసం డబ్బులు వెంట తీసుకెళ్లవలసిన అవసరం లేదు. – సమయం ఆదా అవుతుంది. – టోల్ ప్లాజా వద్ద వాహనం ఆగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఫ్యూయల్ కాస్ట్ ఆ మేరకు సేవ్ అయినట్లే.

()ఆన్ లైన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెఫ్ట్, ఆర్టీజీఎస్, నెట్ బ్యాంకింగ్.. ఎలాగైనా రీచార్జ్ చేసుకోవచ్చు.

()టోల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఎస్సెమ్మెస్ అలర్ట్ వస్తుంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్నా కూడా అలర్ట్ మెసేజ్ వస్తుంది.

()కస్టమర్ల కోసం ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. 5 ఏళ్ల వ్యాలిటీడీ ఉంటుంది.

all vehicles travelling through toll plazas will have to mandatorily pay toll charges using FASTag. … FASTag is a simple to use, reloadable tag which enables automatic deduction of toll charges

- Advertisement -