రష్యాలో పేలుళ్లు..10 మంది మృతి

129
Explosion in Russia-10 dead

రష్యాలో ఉగ్రవాదులు పంజా విసిరారు.  సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ మెట్రో స్టేషన్‌ లో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో పదిమంది మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు మెట్రో స్టేషన్లలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా పేలుడుతో మూడు మెట్రో స్టేషన్లను మూసివేశారు.   ఈ ఘటనపై రష్యా ప్రధాని పుతిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.