శ్రేయా భూపాల్‌కు పెళ్లంట..

213
Shriya bhopal marriage

చిన్న వయస్సులోనే పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుని అఖిల్‌ రికార్డు క్రియేట్‌ చేస్తాడనుకున్నాం, కానీ పీటలు ఎక్కకుండానే క్లైమాక్స్‌కు చేరింది అఖిల్‌ పెళ్లికథ. ఎంతో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరి ఎంగేజ్‌మెంట్ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌లేదు.

 Akhil Dec 13

అక్కినేని అఖిల్ చాలా చిన్న వయసులోనే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ‘జీవీకే’ మనవరాలు అయిన శ్రియభూపాల్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. అఖిల్ కంటే ఆమె నాలుగేళ్లు పెద్ద‌ది అయినా.. నాగార్జున కూడా తన ముద్దుల కొడుకు సిసింద్రి.. ప్రేమను కాదనలేకపోయాడు. ఇక మొదటీ నుంచీ జీవీకే ఫ్యామిలీకి ఈ సంబంధం ఇష్టం లేదు. కానీ పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డారని అయిష్టంగానే ఓకే అన్నారట. గత డిసెంబర్ లో అక్కినేని అఖిల్ తో శ్రేయకు నిశ్చిదార్ధం జరగడం.. ఆ తర్వాత బయటకు చెప్పని కారణాలతో పెళ్లి రద్దు చేసుకోవడం జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే జీవీకే ఫ్యామిలీ శ్రియాభూపాల్‌కు మ‌రో సంబంధం చూసింద‌ట‌.

shriya bhopal

ఓ ఎన్నారై సంబంధాన్ని కుటుంబ సభ్యులు చూపించడం.. శ్రేయా భూపాల్ కూడా తన అంగీకరాన్ని తెలపడంతో ఈ పెళ్లి ఫిక్స్‌ అని టాక్. అఖిల్ కంటే శ్రియాకు అత‌డే క‌రెక్ట్ అని కూడా జీవీకే ఫ్యామిలీ భావిస్తోంద‌ట‌. జీవీకే మనవరాలు అయినా..చిన్న వయసులోనే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులు వేసిన టాలెంట్ ఈమె సొంతం. గతంలో కాజల్ అగర్వాల్.. రకుల్ ప్రీత్ సింగ్.. శ్రియా శరణ్ లతో కలిసి పని చేసిందీ భామ. ఆలియా భట్.. శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ భామలకు కూడా వర్క్ చేసింది శ్రేయ.

Shriya Bhopal designer