సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎర్రబెల్లి…

104
dayakarrao

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ కాకతీయ కాకతీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో 250 ప‌డ‌క‌లతో అన్ని వ‌స‌తులు కల్పించడం కోసం నిధులు విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌డంతో కృతజ్ఞతలు తెలిపారు ఎర్రబెల్లి.

వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో 150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సూప‌ర్ స్పెషాలిటీ దవాఖానలో ఇటీవ‌ల తాత్కాలికంగా ఓపీ సేవ‌ల‌ను ప్రారంభించామ‌ని మంత్రి తెలిపారు. ప్రస్తుతం క‌రోనా ప‌రిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం వ‌ల్ల వ‌రంగ‌ల్ స‌మీప జిల్లాల్లోని నాన్ కోవిడ్ రోగుల‌కు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాల ల‌భిస్తాయ‌ని వెల్లడించారు ఎర్రబెల్లి.