జస్టిస్ కేశవరావు సేవలు మరువలేనివి:ఎర్రబెల్లి

173
errabelli
- Advertisement -

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొట్లపల్లి కేశవరావు సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మొన్న మరణించిన ఆయన కుటుంబ సభ్యులను మంత్రి బుధవారం, హైదరాబాద్ హబ్సిగూడ లోని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్ర సంతాపం ప్రకటిస్తూ మంత్రి వారిని ఓదార్చారు. పొట్లపల్లి కేశవ రావు చిత్రపటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు.

వరంగల్ అర్బన్ జిల్లా పెద్ద పెండ్యాల కు చెందిన కేశవరావు న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పేదలకు అందించిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు.ఆయన మరణం న్యాయ వ్యవస్థకి, పేదలకు తీరనిలోటు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

జస్టిస్‌ పొట్లపల్లి కేశవరావు హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. వరంగల్‌ జిల్లాలో న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1991లో హైదరాబాద్‌కు ప్రాక్టీస్‌ మార్చి, 1996లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులు, ఎన్నికల కేసుల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2010లో సీబీఐ స్పెషల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అనేక సంచలన కేసుల్లో వాదనలు వినిపించారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అని మంత్రి వివరించారు.

- Advertisement -