టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్..

147

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం లార్డ్స్‌లో రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జో రూట్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ షురూ చేసింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి వర్షం ఆటంకం కలిగించింది. దాంతో అరగంట ఆలస్యంగా ఆట మొదలైంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.