లీడ్స్ టెస్టు.. ఇంగ్లండ్ 432 ఆలౌట్..

164

లీడ్స్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 432 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్‌పై తొలి ఇన్నింగ్స్ లో 354 పరుగుల ఆధిక్యతను సాధించింది. మూడో రోజును 423/8 స్కోరుతో ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీకి నాలుగు వికెట్లు దక్కగా, బుమ్రా, సిరాజ్, జడేజాలు చెరో రెండు వికెట్లు తీశారు.

కాసేపటి క్రితం ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 19 ఓవర్లకు 34 పరుగులు. రోహిత్ 25, రాహుల్ 8 పరుగులతో ఆడుతున్నారు. భారత్ 320 పరుగులు వెనుకబడి ఉంది.