INDvsENG :ఇంగ్లాండ్ చరిత్ర తిరగరాస్తుందా?

46
- Advertisement -

వైజాగ్ వేదికగా టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో రోహిత్ సేన పటిష్ట స్థితిలో ఉంది. ఓవరాల్ గా 399 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు ముందు ఉంచింది. ప్రస్తుతం ఛేజింగ్ లో ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 67 పరుగుల వద్ద ఉంది. ఇంకా గెలుపు కోసం 332 పరుగులు చేయాల్సి ఉంది. రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఈ రెండు రోజుల్లో ఇంగ్లాండ్ విజయతీరానికి చేరుకుంటుందా అంటే దాదాపు అసాధ్యమే అంటున్నారు కొందరు క్రీడా నిపుణులు. ఎందుకంటే బౌలింగ్ పరంగాను భారత్ పటిష్టంగా ఉండడంతో ఇంగ్లీష్ జట్టుకు ఛేజింగ్ అంతా ఈజీ కాదనేది చాలా మంది అభిప్రాయం. వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ జట్టు గురించి మాట్లాడుతూ తమ జట్టు 600 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు..

ఒకవేళ ఇంగ్లాండ్ ఇంత భారీ లక్ష్యాన్ని వేధిస్తే చరిత్ర తిరగ రాసినట్లే. టెస్ట్ క్రికెట్ లో ఇంత భారీ లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు ఇప్పటివరకు చేధించలేదు. పైగా భారత్ లో అత్యధిక ఛేజింగ్ రికార్డ్ 387 పరుగులే. ఒకవేళ టీమిండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ వేధిస్తే.. భారత్ లో అదే అతిపెద్ద ఛేజింగ్ అవుతుంది. భారత్ లో ఇప్పటివరకు జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో 250కి పైగా పరుగుల చేధన కేవలం ఐదు సార్లు మాత్రమే జరిగింది. అందులో నాలుగు సార్లు టీమిండియా. ఒక సారి వెస్టిండీస్ పేరు మీద ఉంది. ఇక తాజాగా టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ చేధిస్తే భారత్ లో అత్యధిక పరుగులను చేధించిన జట్టుగా నిలుస్తుంది. మరి ఇంగ్లీష్ జట్టు రికార్డు క్రియేట్ చేస్తుందా లేదా మొదటి టెస్ట్ లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది చూడాలి.

Also Read:ఇకపై TS కాదు TG..కేబినెట్ నిర్ణయాలివే

- Advertisement -