కరోనా క్వారంటైన్‌ సెంటర్‌గా ఈడెన్ గార్డెన్స్‌..!

194
eden gardens
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 25 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం అందరికి ఆందోళన గురిచేస్తుండగా కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

ఇక త్వరలో ఎన్నికలు జరగనున్న బెంగాల్‌లో కూడా కరోనా కేసులు భయంకరంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన ఈడెన్ గార్డెన్స్‌ను క్వారంటైన్ సెంటర్ కోసం ఇవ్వాలని పోలీసులు క్యాబ్‌ని కోరారు.

క్వారంటైన్‌ కోసం స్టేడియంలోని ఐదు బ్లాకులను ఇవ్వాలని క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) అధ్యక్షుడు అభిషేక్‌ దాల్మియాకు కోల్‌కతా కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శుక్రవారం లేఖ రాశారు. స్టేడియంలోని ఈ, ఎఫ్‌, జీ, హెచ్‌, జే బ్లాకులతోపాటు వంటగదిని ఇస్తే క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. మరి దీనిపై క్యాబ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

- Advertisement -