ఆ రాజకీయ పార్టీలకు..ఈసీ షాక్‌

230
political parties
- Advertisement -

రాజకీయ పార్టీ పేరుతో నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్న చిన్నాచితకా పార్టీలపై ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించనుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా కేవలం కాగితాలకే పరిమితమైన సుమారు 200 పార్టీలపై దృష్టి కేంద్రికరించింది. ఆయా పార్టీల ఆదాయ వివరాలపై ఓ కన్ను వేయనుంది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ)కు లేఖ రాయనున్నట్లు సమాచారం. ఈ మేరకు 2005 నుంచి ఎటువంటి ఎన్నికల్లోనూ పాల్గొనకుండా కేవలం కాగితాలకే పరిమితమైన 200 పార్టీలను ఎన్నికల సంఘం గుర్తించింది. వాటి ఆదాయ వివరాలను మదింపు చేయాలని కోరుతూ లేఖ రాయనుంది. విరాళాల రూపంలో నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్నాయని భావిస్తున్న ఈసీ ఈ మేరకు చర్య తీసుకుంటోంది. ఇక నుంచి బ్లాక్మనీని వైట్మనీగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీగా అవతారమెత్తాలని భావించేవారికి చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

political parties

ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఇతర వ్యక్తుల నుంచి విరాళాలుగా రూ.20వేల లోపు తీసుకుంటే..వాటికి ఆయా వ్యక్తుల పేర్లను బయటపెట్టాల్సిన అవసరం లేదు. ఇదే లొసుగును అడ్డుపెట్టుకుని అవి అక్రమాలకు పాల్పడుతున్నాయి. తమకొచ్చే చాలా విరాళాలు రూ.20వేలలోపే ఉంటున్నట్లు అవి పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల ఈ నిబంధనను సవరించాలని ఎన్నికల సంఘం కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.  దీంతో పార్టీలకు వెల్లువెత్తే విరాళాలు, వారు వెచ్చిస్తున్న సొమ్ముపై పారదర్శకత కోసం ప్రస్తుత చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రూ.2వేల పైబడిన మొత్తాలు అందించే దాతల వివరాలను వెల్లడించే విధంగా చట్టాలను సవరించాలని లేఖలో పేర్కొంది. దీంతో పార్టీ విరాళాల్లో కూడా పారదర్శకత తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -