255 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు…

225
Poll panel lists 200 parties that exist mostly on paper
- Advertisement -

బ్లాక్మనీ కార్యకలాపాలపై కఠినచర్యలలో భాగంగా 255 రాజకీయ పార్టీలపై వేటువేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2005 నుంచి 2015 వరకు ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేస్తు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగిస్తున్నాయనే ఆరోపణలతో ఎన్నికల కమిషన్ ఈ పార్టీలను డీలిస్టు చేసినట్లు సమాచారం.

రద్దైన పార్టీల్లో తెలంగాణ, ఏపీ నుంచి 12 పార్టీలు ఉన్నాయి. ఆల్ ఇండియా సద్గుణ పార్టీ, ఆంధ్రనాడు పార్టీ, అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ), బహుజన రిపబ్లికన్ పార్టీ, భారతీయ సేవాదళ్, జై తెలంగాణ పార్టీ, ముదిరాజ్ రాష్ట్రీయ సమితి, నేషనల్ సిటిజన్స్ పార్టీ, ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి),సత్యయుగ్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ,తెలంగాణ ప్రజా పార్టీల గుర్తింపు రద్దయ్యాయి.

మన దేశంలో మొత్తం 1,780 పార్టీలు ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఎన్నికల సంఘానికి కేవలం రాజకీయ పార్టీలను నమోదు చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి కల్పించిన స్వాభావిక అధికారాలతో అన్ని ఎన్నికల ప్రవర్తనలను అది నియంత్రిస్తోంది. కానీ పార్టీలను డీలిస్టు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇంకా కల్పించలేదు. సీరియస్గా లేని రాజకీయ పార్టీలను డీలిస్టు చేసే అధికారం తమకు కల్పించాలని చాలాసార్లు ఎన్నికల సంఘం గత ప్రభుత్వాలను పలుమార్లు కోరింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోలేదు. రూ. 20 వేల కంటే ఎక్కువ మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందితే, అందించిన వారి వివరాలను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కాపీని ఆదాయపు పన్ను శాఖ ప్రతియేటా ఎన్నికల సంఘానికి పంపుతుంది. అయితే చాలా పార్టీలు తమకు రూ.20వేల కంటే ఎక్కువగా అందే విరాళాల వివరాలనే అందించడం లేదు. దీంతో పార్టీ విరాళాల్లో కూడా పారదర్శకత తీసుకొచ్చేందుకు 200 రాజకీయ పార్టీలపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -