దుబ్బాక బీజేపీలో అసంతృప్తి సెగలు..

305
dubbaka bjp

దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావుకు అసమ్మతి సెగ మొదలైంది. ఆయన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్ధానిక బీజేపీ నాయకులు,కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీకోసం కష్టపడిన తనను కాదని రఘునందన్‌రావుకు టికెట్ ఇవ్వడాన్ని స్ధానిక బీజేపీ నేత కమలాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన‌ కార్య‌క‌ర్త‌ను కాద‌ని ఒక రేపిస్ట్‌కు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ టికెట్ కేటాయించింది. నిబ‌ద్ద‌త‌, నిజాయితీతో పార్టీ కోసం ప‌ని చేసిన త‌న‌ను బీజేపీ వ‌దిలేసిందని మండిపడ్డారు. ర‌ఘునంద‌న్‌రావుకు బీ ఫామ్ ఇవ్వ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని…. ఇప్ప‌టికే ప‌లుమార్లు దుబ్బాక‌కు చెడ్డ పేరు తీసుకువ‌చ్చిన రఘునంద‌న్‌రావుకు టికెట్ ఇవ్వ‌డం దారుణం. ఇది పార్టీ ఎదుగుద‌ల‌కు, గెలుపుకు అస‌లు ఉప‌యోగ‌ప‌డ‌దు అని తేల్చిచెప్పారు.

అవినీతితో, అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించిన అహంకారికి టికెట్ ఇచ్చింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ డ‌బ్బు వైపే మొగ్గు చూపింద‌న్నారు. ఈ విష‌యంలో బండి సంజ‌య్ మ‌రోసారి ఆలోచించాల‌ని ఆయ‌న కోరారు.2014, 2018 ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా రాలేదు. అందుకు కార‌ణం ఇక్క‌డ స‌రైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌క‌పోవ‌డ‌మే అని చెప్పారు.