తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్‌:ఎమ్మెల్యే చందర్‌

193
korukanti chander

రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయశక్తిగా మారిందన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌. రామగుండం 13వ డివిజన్ కార్పొరేటర్‌ రాకం లత – దామోదర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి 200 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌..టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యమని, ప్రజల గుండెల్లో గులాబీ జెండా నిండి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికుల కోసం గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నిమయాకాల ద్వారా వారసులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి స్థలాలకు యాజమాన్య హక్కును కల్పిస్తూ పాస్ బుక్ లను త్వరలోనే అందిస్తామన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా మారాడని తెలిపారు.పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఏ ఎన్నికైనా టీఆర్ఎస్ విజయం సాధిస్తూ తిరుగులేని రాజకీయశక్తిగా మారిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అకర్షితులయ్యే పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని పేర్కొన్నారు.