మొక్కలు నాటిన యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్..

248
Yadadri Bhongir AC

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చొరవ భావితరాలకు బంగారు బాట, దూరదృష్టితో బాధ్యాయుతంగా హరిత హారం చేపట్టి మొక్కలు నాటి వాటిని కాపాడే విధంగా చట్టం తీసుకురావడం అయన మొక్కలపై ఉన్న బాధ్యత అద్దం పడుతుంది.

దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్రమంతటా అవగాహాన కల్పిస్తుంది, ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరో ముగ్గురికి ఖీమ్యా నాయక్ అడిషనల్ కలెక్టర్ యాదాద్రి భువనగిరి, భోపాల్ రెడ్డి ఆర్డీవో భువనగిరి, సూరజ్ కుమార్ ఆర్డీవో చౌటుప్పల్ లకి ఛాలెంజ్ చేశారు.