కాంగ్రెస్‌తోనే మా పోటీ: మంత్రి తలసాని

29
talasani

గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మీడియాతో మాట్లాడిన తలసాని ..104 సీట్లకు పైగా గెలుస్తాం..మా ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే అని స్పష్టం చేశారు.స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది…24 గంటల విద్యుత్, పెన్షన్, కేటీఆర్ కిట్లు, రోడ్ల అభివృద్ధి చేస్తున్నాం…వర్షం-వరదలు 108 ఏళ్ల తర్వాత భారీ విపత్తు సంభవిస్తే..పొరుగున ఉన్న సీఎం లు స్పందించారని తెలిపారు.

కేంద్రం మాత్రం కాలయాపన చేసింది..నెల తర్వాత కేంద్ర బృందం వచ్చింది..ఒక్క దమ్మిడి ఇవ్వలేదు…వెంటనే సీఎం స్పందించి..గొప్ప మనసున్న వ్యక్తిగా…కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు.భారతదేశ చరిత్రలో ఇటువంటి సాయం ఎక్కడా చేయలేదు..4.75, 781 మందికి నేరుగా నిధులు..ఆ తర్వాత మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు..

బోగస్ పార్టీలు…విషం చిమ్ముతున్నాయి…1.65 లక్షల దరఖాస్తులు 165 కోట్లు అకౌంట్లలో వేసేశారు…కొందరు ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశారని వెల్లడించారు.మీ సేవ కేంద్రాల్లో ఇవ్వడం నిలిపివేశారు..ఎన్నికల తర్వాత కూడా వరద సాయం కొనసాగిస్తాం…పేద వాళ్ళ ఉసురు వాళ్లకు కచ్చితంగా తగులుతుంది…ఒకవైపు తక్కువ సీట్లకు పోటీ చేస్తున్నామని రెచ్చగొడుతున్నారు..

ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్, భాజపా ఏం చేశారో చెప్పండి..మీ బలం బలగం బలంగా ఉంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వకండి..కాంగ్రెస్, భాజపాకు 75 స్థానాలకు కూడా అభ్యర్థులు దొరకరు..ఏం చేయాలన్నా తెరాసనే చేస్తోంది..కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఆయిన తర్వాత ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి..?రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయి..70వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం..డబుల్ బెడ్ రూమ్ లు ఒక్క రొజులోనే కావు..ఆలస్యమైనా పూర్తి చేస్తాం..మీరు ఏం చేయరు..తిట్టే కార్యక్రమం మాత్రం చేస్తారు..గత ghmc ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని గెలిచారో మేం ఎన్ని గెలిచామో ప్రజలకు తెలుసు…మా ఇంట్లో నుంచి ghmc ఎన్నికల్లో ఎవ్వరూ పోటీ చేయడం లేదు..సిట్టింగ్ లో అందరికి అవకాశం ఉంటుంది..కొందరికి తప్ప..మాది ఫుల్ లోడ్ బండి అన్నారు.