గాంధీనగర్‌ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం

32
mlc kavitha

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా, గాంధీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నాహక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1 న జరగనున్న ఈ ఎన్నికలలో భాగంగా ప్రచార కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీ నగర్ కార్పోరేటర్ ముఠా పద్మనరేష్, టీఆర్ఎస్ నాయకులు ‌ముఠా‌ నరేష్, ముఠా జైసింహ, స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.