ఓడిపోతే దేశం విడిచి వెళ్లిపోతా: ట్రంప్‌

100
trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్ది ట్రంప్- బైడెన్‌ ఒకరికొరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం జార్జియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్‌…అమెరికా అధ్యక్షుడిగా తిరిగి తాను ఎన్నిక కాకపోతే దేశం విడిచి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు.

ఓ అధ్వాన్నాపు అభ్యర్ధి జో బైడెన్ చేతిలో ఓడిపోవడం కంటే దేశం విడిచి వెళ్లిపోవడమే బెటర్ అన్నారు. ఇది జోక్ కాదని పొలిటికల్ హిస్టరీలో పస సామర్థ్యం లేని అభ్యర్థిపై తను పోటీ చేయవలసి వస్తోందని చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనుండగా ట్రంప్‌కు కరోనా కారణంగా సెకండ్ డిబేట్ రద్దైంది. ఇక మూడో డిబెట్ త్వరలోనే ఉండనుండగా ఇదైనా జరుగుతుందా లేదా అన్న సందేహం నెలకొంది.