మరింత క్షిణీంచిన కరుణానిధి ఆరోగ్యం..

195
karunanidhi

రాజకీయ కురువృద్ధుడు,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం మరింత క్షిణించింది. తీవ్ర అస్వస్థతతో చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రిలో చేరిన కరుణా ఆరోగ్యం విషమించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

రాత్రి 6.30కి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు వయోభారం కారణంగా కరుణానిధి అవయవాలను పనిచేయించడం సవాలుగా ఉందని, తర్వాతి 24 గంటల్లో అందించే వైద్యానికి ఆయన శరీరం స్పందించే తీరునుబట్టి ఆరోగ్య పరిస్థితిని నిర్ణయించగలమని తెలిపారు.

కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌ తొలిసారిగా సోమవారం ఆస్పత్రికి చేరుకోవడంతో డీఎంకే శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కావేరి ఆస్పత్రికి పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు తరలివస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కావేరి ఆస్పత్రిలో కరుణానిధిని పరామర్శించారు.