సుకుమార్ ప్రొడ‌క్ష‌న్ లో నిధి అగ‌ర్వాల్..

535
nidhi agarwal

నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన స‌వ్వ‌సాచి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యింది. చందు మెండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈమూవీలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ఈసినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయిన నిధి న‌ట‌న‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈభామ అఖిల్ స‌ర‌స‌న మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలో న‌టిస్తుంది. ఈమూవీకి తొలిప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒకే సారి ఇద్ద‌రు అక్కినేని హీరోల‌తో ఛాన్స్ కొట్టేసింది నిధి అగ‌ర్వాల్. మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా జ‌న‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

nidi, naga

ఈసినిమా హిట్ అయితే మాత్రం ఆమెకు మ‌రిన్ని సినిమాల్లో న‌టించేందుకు అవ‌కాశాలు రానున్నాయి. తాజాగా ఆమెకు మ‌రో సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. నాగ‌శౌర్య స‌ర‌స‌న న‌టించేందుకు నిధి అగ‌ర్వాల్ ను ఏంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తరువాత ఆయన కాశీ అనే నూతన దర్శకుడితో కలిసి మూవీ చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం నిధి అగర్వాల్ ను తీసుకున్నారని టాక్. ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న సొంత బ్యాన‌ర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు.