‘సీత’ పాత్రలో కాజ‌ల్..

362
kajal
- Advertisement -

కాజ‌ల్ అగ‌ర్వాల్ టాలీవుడ్ లో అగ్ర‌క‌థానాయ‌కుల అంద‌రితో న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె చిన్న హీరోల‌తో కూడా న‌టిస్తుంది. దాదాపు అటు పెద్ద హీరోల అంద‌రి స‌ర‌స‌న ఆమె న‌టించిన సినిమాలు విజ‌యాలు సాధించాయి. దీంతో ఆమెతో న‌టించడానికి చిన్న హీరోలు కూడా ఆస‌క్తి చూపుతున్నారు. ఇటివ‌లే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టించిన క‌వ‌చం మూవీలో హీరోయిన్ గా న‌టించింది. ఈసినిమా ప్ర‌స్తుతం ధియేట‌ర్ల‌లో ఉంది.

sai bellamkonda

ఇక మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేషన్లో మ‌రోమూవీ రానుంది. ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈమూవీ రూపొందుతోంది. ఈమూవీలో క‌థ అంతా హీరోయిన్ పాత్ర చూట్టునే తిరుగుతుంద‌ట‌. అందుకే ఈసినిమా టైటిల్ పేరు కూడా సీత అని పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది. టైటిల్ కాజల్ పాత్రను బట్టి ఉంటుందని తేజ చెప్పినప్పటికీ, బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. హీరోయిన్ ప్రాధాన్య‌త క‌లిగిన సినిమాను బెల్ల‌కొండ శ్రీనివాస్ ఒప్పుకోవ‌డం నిజంగా విశేషంగా చెప్పుకోవ‌చ్చు అంటున్నారు సినీ విశ్లేష‌కులు.

- Advertisement -