ఒడియన్ టీజర్

252
mohan lal
- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒడియన్. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేశారు. ఒడియన్ వాడు.. చీకటి రాజ్యానికి రారాజు అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ సినిమాపై ఉత్కంఠ రేకెత్తించేదిగా ఉంది.

ఇప్పటి వరకూ నీవు నన్ను ఎన్నో రూపాల్లో చూసి ఉంటావ్.. కాని నువ్ చూడని రూపం ఇంకోటి ఉంది అన్న డైలాగ్‌కి తగ్గట్టుగానే వివిధ రూపాల్లో కనిపిస్తున్నారు మోహన్ లాల్. ఈ సినిమా కోసం మోహన్ లాల్ తెగకష్టపడ్డారు. 55 సంవ‌త్స‌రాల నుండి 30 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని ‘ఒడియన్’గా కనిపిస్తున్నారు.

డిసెంబర్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మోహన్ లాల్ సరసన మంజు వారియర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

- Advertisement -