మొక్కలు నాటిన దర్శకురాలు నందిని రెడ్డి

223
nandini reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారి సారథ్యంలో హీరో నాగ శౌర్య విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటారు సినీ డైరెక్టర్ నందిని రెడ్డి. సీడ్ గణేష్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు డైరెక్టర్ నందిని రెడ్డి కి విత్తన గణపతి ని అందజేశారు.

రాబోయే తరాలకు ఆక్షిజన్ ను అందించాలంటే మనమంతా మొక్కలు నాటాలని డైరెక్టర్ నందిని రెడ్డి అన్నారు.వివిధ రంగాల వారిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ హీరో నాగ శౌర్య విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురు ( హీరో నాగ చైతన్య , హీరోయిన్ లావణ్య త్రిపాఠి , మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ ) లు మొక్కలు నాటాలని డైరెక్టర్ నందిని రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -