మెగా డాటర్ ఎంగేజ్‌మెంట్…పవన్ డుమ్మా!

183
Niharika-Konidela-engagement
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు డాటర్ కొణిదెల నిహారిక ఎంగేజ్‌మెంట్ నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ హాజరుకాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ డుమ్మా కొట్టారు.

దీంతో పవన్ డుమ్మా కొట్టడంపై రకరకాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ మెగా ఫ్యామిలీ పవన్ డుమ్మా కొట్టడానికి గల కారణాలను తెలిపింది. పవన్ చాతుర్మాస్య దీక్ష‌లో ఉండటంతో ఈ ఫంక్షన్‌కు హాజరుకాలేదని తెలిపింది.

ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవితో సహా అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ అంద‌రూ హాజ‌ర‌య్యారు. కొత్త పెళ్లి కూతురితో ఫొటోలు దిగుతూ సంద‌డి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -