అనాథలను దత్తత తీసుకున్న దిల్ రాజు..మంత్రి ఎర్రబెల్లి హర్షం

157
dil raju
- Advertisement -

మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు పెద్దమనసు చాటుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అడిగిన వెంటనే ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని తన ఉదారత చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన గట్టు సత్తయ్య గతేడాది అనారోగ్యం కారణంగా చనిపోయాడు. దీంతో తన ముగ్గురు పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్‌లను పోషించే బాధ్యత భార్య అనురాధపై పడింది. అయితే భర్త చనిపోయిన కొద్దిరోజులకే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమె రెండు రోజుల క్రితమే చనిపోయింది. గ్రామస్తులు చందాలు వేసుకుని అనురాధ అంత్యక్రియలు నిర్వహించగా ఆ కుటుంబ ధీన స్ధితిపై పత్రికల్లో వచ్చిన వార్తకు స్పందించారు మంత్రి ఎర్రబెల్లి.

వెంటనే సంబంధిత గ్రామ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఆరా తీశారు. అనంత‌రం ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని తెలిపారు. దీంతో దిల్ రాజును మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.

- Advertisement -