కరోనా వస్తే గాంధీలోనే ట్రీట్‌మెంట్: తలసాని

99
talasani srinivas

తనకు కరోనా వస్తే గాంధీ హాస్పిటల్‌లోనే చికిత్స చేయించుకుంటానని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్త శుద్దితో కృషిచేస్తుందన్నారు.

ఒకవేళ తనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లనని స్పష్టం చేసిన తలసాని…గాంధీ ఆస్పత్రిలోనే ట్రీట్ మెంట్ చేయించుకుంటానని వెల్లడించారు.
కరోనా నియంత్రణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంద‌న్నారు.

సనత్ నగర్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించానని తెలిపిన తలసాని.. టీఆర్ఎస్‌ది సంక్షేమ సర్కార్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం..పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకడం వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటుండటంతో ఈమేరకు తలసాని స్పందించారు.