మొక్కలు నాటిన కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి

89
kamalsan reddy

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీనటుడు శివారెడ్డి చాలెంజ్ ను స్వీకరించి శనివారం కరీంనగర్ పోలీసు కమిషనరేట్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకు పోతున్నారని దానిలో భాగంగా నేను కూడా సినీ నటుడు శివారెడ్డి చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.

అదేవిధంగా సినీ నటుడు వెంకటేష్ , టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సైనా జైస్వాల్ , సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు తమవంతు పాత్ర పోషించాలన్నారు.