భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

442
Petrol Price
- Advertisement -

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పడిపోతున్నాయి. అలాగే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ముడి చమురు ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు..

ప్రస్తుతం దేశీ ఇంధన ధరలు మళ్లీ తగ్గాయి. పెట్రోల్ ధర 17 పైసలు, డీజిల్ ధర 16 పైసలు చొప్పున దిగొచ్చింది. దీంతో హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97కు, డీజిల్ ధర రూ.67.82కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 16 పైసలు తగ్గుదలతో రూ.69.59కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 15 పైసలు క్షీణతతో రూ.62.29కు తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబయిలో పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 16 పైసలు తగ్గుదలతో రూ.75.30కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 16 పైసలు క్షీణతతో రూ.65.21కు దిగొచ్చింది.

- Advertisement -