వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్..!

311
Whatsapp

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ ఈమధ్యే డార్క్ మోడ్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్ సదుపాయాన్ని కస్టమర్లకు అందించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, యూజర్లు తాము పంపిన మెసేజ్ లను ఆటోమేటిక్ గా తొలగించే సదుపాయం దగ్గరవుతుంది.

నిర్ణీతకాలంగా, ఓ గంటో, ఓ రోజో, వారమో, నెలో ముందుగానే ఎంచుకుంటే, ఆ మెసేజ్ లు సమయం ముగిసిన తరువాత డిలీట్ అవుతాయి. తొలి దశలో ఈ ఫీచర్ ను గ్రూప్ చాటింగ్ నకు మాత్రమే పరిమితం చేయాలని, ఆపై వ్యక్తిగత చాటింగ్ నకు కూడా వర్తింపజేయాలని వాట్సాప్ భావిస్తోంది. మిగతా అప్ డేటెడ్ ఫీచర్ల మాదిరిగానే ఇది కూడా తొలుత బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది.