ఢిల్లీ ప్రజాలారా.. ఐ లవ్ యూ

429
Kejriwal1.jpeg
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్ధానాలకు గాను 63 స్ధానాల్లో గెలుపొందింది. భారతీయ జనతా పార్టీకి కేవలం 7సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. మూడో సారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారీ విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు ఉద్దేశించి మాట్లాడారు.

ఈసందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ఐ లవ్ యూ ఢిల్లీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. సొంత కొడుకులా ఆదరించి మూడోసారి నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఈ గెలుపు సరికొత్త రాజకీయ వ్యవస్ధకు ప్రతిరూపమన్నారు. ఇది భరతమాతకు దక్కిన గౌరవం అన్నారు. ఈ రోజు మంగళవారం. ఆంజనేయస్వామి దినం. ఢిల్లీ ప్రజలపై హనుమంతుడు ఆశీర్వచనాలను కురిపించాడు. థాంక్యూ హనమాన్ జీ’ అని కేజ్రీవాల్ అన్నారు. ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపుకు నాంది అన్నారు. మరో ఐదేళ్లపాటు మనమందరం కలిసి కష్టపడదామని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా మూడోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు అరవింద్ కేజ్రీవాల్.

- Advertisement -