ఉచిత విద్యుత్..ఆప్ హామీ..!

116
kejriwal
- Advertisement -

వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తికనబరుస్తున్న ఆప్‌…ఆసక్తికర మేనిఫెస్టోతో ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌లో తాము అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది ఆప్. ఆ పార్టీ చీఫ్, సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

అధికారంలోకి వ‌స్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్య‌త్ అందిస్తామ‌ని వెల్లడించారు. గ‌త పంజాబ్ ఎన్నిక‌ల్లో ఆప్ కొంత ప్రభావం చూపించగలిగింది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో వారికి అండగా నిలబడింది ఆప్‌. పంజాబ్ నుంచి వ‌చ్చిన రైతుల‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసింది.

పంజాబ్‌తో పాటు ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -