బిగ్ బాస్ 5 హోస్ట్‌గా రానా..!

192
rana
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5కి రంగం సిద్ధమైంది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో త్వరలోనే సీజన్ 5 ప్రారంభంకానుండగా ఇప్పటికే కంటెస్టెంట్స్ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే వార్తలు వస్తుండగా తాజాగా ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

నాగార్జున త‌న సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఆ బాధ్య‌త‌ను రానాకి అప్ప‌జెప్పిన‌ట్టు టాక్ నడుస్తోంది. ఇప్ప‌టికే రానా బుల్లితెర‌పై నెం 1 యారి అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన విరాట ప‌ర్వం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -