సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యపై స్పందించారు సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి. మద్యం మత్తులో వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని…గజ్వేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.
మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు కొంతకాలంగా సెలవులో ఉన్నారని ఆయన భార్య విజ్ఞప్తి మేరకే విధుల్లోకి తీసుకున్నామని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉన్నారని డీసీపీ చెప్పారు.
వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై డీ అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందారని తెలిపారు సీపీ జోయల్ డేవిస్. గత నెల 29న విధుల్లో చేరారని…. విధుల్లో చేరిన తర్వాత కూడా తరచూ సెలువులో ఉండేవారన్నారు. వెంకటేశ్వర్లు భార్య విజ్ఞప్తి మేరకు నిన్ననే మళ్లీ విధుల్లోకి చేర్చుకున్నాం అని తెలిపారు జోయల్ డేవిస్.