డ్రైవర్‌ను హత్య చేసిన ఐఏఎస్ కొడుకు?

219
Involvement of IAS man’s son suspected
- Advertisement -

రాజధాని నడిబొడ్డున ఓ కారు డ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. యూసుఫ్‌ గూడలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ హత్య… ఆలస్యంగా వెలుగులోకి చూసింది. దీనికి పాల్పడింది ఓ ఐఏఎస్‌ అధికారి కుమారుడిగా అనుమానిస్తున్నారు. నాగరాజు హత్యకేసులో ఐఏఎస్‌ అధికారి కుమారుడు సాయి సుకృత్ ను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్యకేసు విచారణలో భాగంగా ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్వర్లును జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణకు పిలిచారు. అయితే ఆయన ఫోన్‌ను సైతం పోలీసులు తీసుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

వివరాల్లోకి వెళ్తె… సూర్యాపేట సమీపంలోని దుబ్బతండాకు చెందిన కారు డ్రైవర్‌ భూక్యా నాగరాజు (40)… భార్య జమున, తన ఇద్దరు పిల్లలతో రహమత్‌నగర్‌లోని జవహర్‌ నగర్‌లో ఉంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్‌ అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజుతో వెళ్లిన వ్యక్తి మాత్రమే కిందకు దిగి వెళ్లిపో యాడు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదే వ్యక్తి సదరు అపార్ట్‌మెంట్‌ పైకెళ్లి… ఓ మూటను కిందకు తీసుకొస్తుం డగా చప్పుడయింది. ఈ అలికిడికి అప్రమ త్తమైన అపార్ట్‌మెంట్‌లోని ఓ వృద్ధుడు… ఎవరు నువ్వు… ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో సదరు వ్యక్తి మూట వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

Hyd

ఐఏఎస్‌ అధికారి దగ్గర నాగరాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు అతని భార్య పోలీసులకు తెలిపింది. అపార్టుమెంట్‌ వాచ్‌మేన్‌ సెలవులో ఉండటంతో వారిద్దరు టెర్రస్‌పైకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగరాజు హత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు పోలీసులు.సీసీ టీవీ ఫుటేజీలో లభించిన యువకుడి చిత్రాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. నాగరాజు హత్యకు కారణమైన వెంకట్‌ను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -