భారత్ బయోటెక్ మరో ముందడుగు..

189
covid
- Advertisement -

కరోనా వ్యాక్సినేషన్‌ తయారలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ఆ సంస్థ తయారుచేస్తున్న 2-18 వయస్కులపై టీకా క్లినికల్‌ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ట్రయల్స్‌లో భాగంగా 28 రోజుల్లోపు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయనుండగా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్‌, నాగాన్‌పూర్‌ మెడిట్రినా సంస్థలో జరుగనున్నాయి.

ఇక ఇప్పటికే పలు సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డీసీజీఐ ఇటీవలె డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ) రూపొందించిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔష‌ధ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

ఇది స్వ‌ల్ప నుంచి మోస్త‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని…క‌రోనా బాధితులకు ప్ర‌ధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని వెల్లడించింది.

- Advertisement -