జర్నలిస్టులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కృష్ణారావు

35
krishnarao

కరోనా సోకిన వారికి వైద్యసేవలు అందించడంతోపాటు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన బుధవారం కూకట్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు.

కూకట్‌పల్లి నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా విలేకరుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని పేర్కొన్నారు.
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకుంటానని వివరించారు. ప్రతిరోజూ క్యాంపు కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని ఆపద సమయంలో నేరుగా గాని, ఫోన్‌ ద్వారా కాని తనను సంప్రదించి సేవలు పొందాలని సూచించారు.ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కృష్ణారావు.