రహదారి భద్రత చర్యలపై సీఎస్‌ సమీక్ష..

234
CS
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారి భద్రత చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బిఆర్ కెఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవలసిన అవసరముందని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, జిహెచ్ఎంసి తదితర ఇంజనీరింగ్ విభాగాలు వచ్చేనెల 15వ తేదీలోగా ప్రమాదాల నివారణకు సంబంధించిన అవసరమైన తాత్కాలిక చర్యలను పూర్తి చేయాలని సి.యస్ అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డేటా సేకరణను మరింత పటిష్టంగా సేకరించడానికి జియో కో ఆర్డినేట్‌తో, ఫోటో గ్రాఫ్ లతో డేటాను క్యాప్చర్ చేయడానికి అవసరమైన యాప్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సరియగు సైనేజి బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్ఆర్ కు సంబంధించి ఆటోమేటెడ్ పద్ధతితో కూడిన (స్పీడ్ గన్స్ కెమెరాలు) ప్రత్యేక సెక్యూరిటీ సేప్టీ ప్లాన్‌ను రూపొందించి అవసరమైన ఎన్ ఫోర్స్ మెంటు చర్యలను చేపట్టాలన్నారు. ట్రామా కేసులకు తక్షణ వైద్య సహాయం అందించేలా యూనిఫైడ్ అంబులెన్స్ నెట్ వర్క్ , ట్రామా సెంటర్స్, అవసరమైన ఆసుపత్రులలాంటి అంశాలను అధ్యయనం చేయడానికై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి సమర్పించడానికి అవసరమైన నివేదికను వారంలోగా తయారు చేయాలని కోరారు. ప్రమాదాల బాధితుల ప్రాణాల రక్షణ కోసం ఈఎంఆర్ ఐ(EMRI) ద్వారా వాలంటీర్లకు ఆక్టీవ్ బ్లీడింగ్ కంట్రోల్ శిక్షణ పెద్ద ఎత్తున చేపట్టి విస్తృతమైన మార్పును తీసుకురావాలన్నారు. ప్రభుత్వ డ్రైవర్స్, ఇన్ స్టిట్యూషన్ డ్రైవర్లకు రహదారి భద్రత చర్యలపై మరింత అవగాహన కల్పించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, అడిషనల్ డిజి (L&O)జితేందర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, వాటర్ బోర్డు యండి. దానకిషోర్, జిహెచ్ ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, రవాణా శాఖ కమీషనర్ యం.ఆర్.యం. రావు, సందీప్ శాండిల్య తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -