ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ అద్భుత ప్రతిభ..

206
telangana
- Advertisement -

కంప్యూటర్ సొసైటీ అఫ్ ఇండియా- స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అవార్డు జ్యూరి ఎదుట తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర పంచాయితి రాజ్ శాఖ, NIC డిల్లీలు తెలంగాణ ఆన్‌లైన్ ఆడిట్ విధానం అద్భుతంగా ఉన్నందని తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలని సూచించారు. అందులో భాగంగా (CSI-SIG) కంప్యూటర్ సొసైటీ అఫ్ ఇండియా-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అవార్డు జ్యూరి ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆడిట్ సంచాలకులు, పంచాయితి రాజ్ అధికారులతో వీడియొ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను CSI-SIG జ్యూరి కమిటి సభ్యులు అభినందనలు తెలిపారు. కరోన విపత్కర పరిస్థతిలో తెలంగాణలోని 12796 గ్రామ పంచాయితిలకు గానూ 5152 గ్రామ పంచాయితి లు నిర్వహించిన తీరు అద్భుతమని జ్యూరి కమిటి సభ్యులు అభినందనలు తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన 5152 గ్రామ పంచాయితిలను 52 రోజుల్లోనే నిర్వహించినట్లు తెలంగాణ సంచాలకులు తెలిపారు. ఆన్‌లైన్ లోనే ఆడిట్ చేసి ఆడిట్ నివేదికలను గ్రామ పంచాయితిలకు పంపమన్నారు. 5152 గ్రామ పంచాయితిలను ఆడిట్ చేసి 56520 అభ్యంతరంలు నమోదు చేసినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు.

రెండు దశల్లో ఆన్‌లైన్ ఆడిట్ నిర్వహించినట్లు, మొదటి విడత 3225 గ్రామపంచాయితిలు, రెండో విడత 1927 గ్రామపంచాయితిలు నిర్వహించామన్నరు. 2019-20లో 40% గ్రామపంచాయితిలు ఆన్‌లైన్ ఆడిట్ నిర్వహించినట్లు, రాన్నున్న 2020-21లో 100% ఆన్‌లైన్ ఆడిట్ నిర్వహించానున్నట్లు, 2021-22 లో గ్రామపంచాయితిలు, మునిసిపాలిటీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు 100% ఆన్‌లైన్‌లో ఆడిట్ చేయనున్నట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ సంచాలకులు వివరించారు. ఈ వీడియొ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాల ఆడిట్ సంచాలకులు, పంచాయితి రాజ్ అధికారులు ఉన్న జ్యూరి సభ్యులు మాత్రం తెలంగాణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పట్ల ఆసక్తి చూపి సమయం ఎక్కువ కేటాయించి ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ ఆడిట్ శాఖ అనుసరించిన విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చెయ్యాలని జ్యూరి సభ్యులు సూచించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహర్ ఆడిట్ అధికారులకు తెలంగాణ సంచాలకులు శిక్షణ ఇవ్వడాన్ని CSI-SIG జ్యూరి సభ్యులు, కేంద్ర పంచాయితి రాజ్ శాఖ జాయింట్ కార్యదర్శి సేధీ అభినందించారు. CSI-SIG జ్యూరి సభ్యులు ఆన్‌లైన్ ఆడిట్ అప్పిలికేషన్ రుపొంచిన విధానం, ఆడిట్ నివేదికలు పొందుపరిచి గ్రామపంచాయితిలకు పంపేలా తీసుకున్న చర్యలు అద్భుతమని సభ్యులు, కేంద్ర పంచాయితి రాజ్ శాఖ జాయింట్ కార్యదర్శి కె ఎన్ సేధీ పేర్కొన్నారు.

ఇక నుంచి ఆన్‌లైన్లోనే గ్రామ పంచాయితిల ఆడిట్..

ఇకపై ఆన్‌లైన్ లోనే గ్రామ పంచాయితిల ఆడిట్ నిర్వహించాలని కేంద్ర పంచాయితి రాజ్ శాఖ కార్యదర్శి సేతి రాష్ట్రాలను ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆర్ధికశాఖ కార్యదర్శిలు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే గ్రామ పంచాయితిలతో నిర్వహించడంతోపాటు మిగిలిన అన్ని ఆడిట్ లు ఆన్‌లైన్‌లోనే చేసేలా చూడాలని తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావుకు సూచించారు. శుక్రవారం సంచాలకుల కార్యాలయంలో జిల్లాల అధికారులతో రివ్యు సమావేశం నిర్వహించారు. తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఇక నుంచి ఆన్‌లైన్ లోనే గ్రామ పంచాయితిల ఆడిట్ 2020-21లో 50 % ఆన్‌లైన్‌లో మండల పరిషత్ ల ఆడిట్ తదితర అంశాలపై తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్స్ ద్రాక్షయిని, ఇందిర రాణి, రాము, రేవతి, వెంకటేశం లతో పాటు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -