టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాపై ఓ పోలీస్ కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. ఈ సంఘటన నిన్న(సోమవారం) సాయంత్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చోటుచేసుకుంది. తన బైక్‌ను ఢీకొట్టినందుకు గాను కానిస్టేబుల్ రీవాపై దాడి చేసినట్లు సమాచారం. ఇక విషయానికొస్తే షాపింగ్ నిమిత్తం జామ్‌నగర్‌లో సరు సెక్షన్ రోడ్ నుంచి రీవా కారులో వెళ్తుండగా అదే సమయంలో రాంగ్ రూట్లో వస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని రీవా కారు ఢీకొంది.
ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఆగ్రహించిన ఆ కానిస్టేబుల్ రీవాపై వాగ్వాదానికి దిగాడని, జుట్టు పట్టుకుని కొట్టబోయాడని స్థానికులు చెబుతున్నారు. ఇక సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న ఆనంతరం ఆ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు.
ఓ మహిళపై దాడి చేయడం తీవ్రమైన చర్య అని, దీనిపై విచారణ జరిపి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని జామ్‌నగర్ ఎస్పీ ప్రదీప్ తెలిపారు. గతంలో రీవా ఓ యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఇక రీవా భర్త జడేజా ప్రస్తుతం ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందుతున్నాడు.