వ‌చ్చాడ‌య్యో సామి ఫుల్ వీడియో సాంగ్..

241
Vachaadayyo Saami Song Video Released
- Advertisement -

కొరటాల శివ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు,కైరా అద్వానీ హీరో హీరోయిన్‌లుగా తెరకెక్కిన సినిమా ‘భరత్ అనే నేను’. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలై బక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నినమోదు చేసుకుంది. పూర్తి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

Vachaadayyo Saami Song Video Released

అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవల ఈ చిత్రంలోని అన్ కట్స్ సిన్స్‌ను కూడా విడుదల చేశారు. ఫార్మర్ అన్ కట్ సీన్, ఎడ్యుకేషన్ అన్ కట్ సీన్, ప్రెగ్నెంట్ విమెన్ అన్ కట్ సీన్, అసెంబ్లీ అన్ కట్ సీన్ అంటూ నాలుగు అన్ కట్ సీన్లను రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని వ‌చ్చాడ‌య్యో సామి అనే వీడియో సాంగ్‌ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం.

కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి లిరీక్స్ అందించిన ఈ సాంగ్‌కు మంచి అదరణ వచ్చింది. అయితే మే 25న త‌మిళ‌నాట ‘భ‌ర‌త్ ఎనుము నాన్’ పేరుతో ఈ చిత్రం విడుద‌ల అవుతుండగా ఇక కేర‌ళ‌లోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=O9Zc6CWv8js

- Advertisement -