‘యాత్ర’లో భూమిక..?

635
- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా మొదలైంది. సావిత్రి సినిమా ఎప్పుడైతే విడుదలై మంచి సక్సెస్ అయ్యిందో ఇక దైర్యంగా నిజ జీవిత కథలను చూపించవచ్చని సినిమా దర్శకులు అభిప్రాయపడునున్నారు. అయితే హీరో నందమూరి బాలకృష్ణ అదే తరహాలో ఇటీవల ఎన్టీఆర్ సినిమా పనులను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా తెరకెక్కుతోంది.

Bhumika Chawla in YSR biopic Yatra

వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. ఈ చిత్రంలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్రను ప్రముఖ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు. విజయమ్మ పాత్రను ‘బాహుబలి-2’ ఫేం ఆశ్రిత వేముగంటి పోషించనున్నారు. జగన్ పాత్రను ఎవరు పోషించబోతున్నారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. వైయస్ ప్రధాన అనుచరుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఫేమ్ మ‌హీ రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కూడా విడుదలై అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Bhumika Chawla in YSR biopic Yatra

ఇక ఈ చిత్రంలో వైయస్ కుమార్తె షర్మిల పాత్రలో భూమిక నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి మెప్పించిన అందాల హీరోయిన్ భూమిక‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి కాస్త దూర‌మైన భూమిక ఈ మ‌ధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా తెర‌కెక్కిన‌ ఎంసీఏ చిత్రంలో వ‌దిన పాత్ర‌లో న‌టించి అల‌రించింది. స‌మంత‌- ఆది పినిశెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న యూట‌ర్న్ చిత్రంలో కూడా న‌టిస్తుంది. ఈ మూవీలో భూమిక దెయ్యంలా క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు.

- Advertisement -