సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అరెస్ట్..

135
cpi
- Advertisement -

మంచిర్యాల జిల్లా గోదావరి ఖనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అరెస్ట్ అయ్యారు. దీంతో మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ లో దీక్షకు దిగారు. ప్రధాని మోడీ పర్యటనకు నిరసన తెలిపేందుకే రామగుండం వెళ్లేందుకు బయలుదేరారు.

ఉదయమే గోదావరి ఖనిలో అడ్డుకున్నారు పోలీసులు. అనంతరం అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ స్టేషన్ కి కూనంనేని తరలించారు. అక్కడే దీక్ష చేశారు కూనంనేని. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ , ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్ట్ లు అప్రజాస్వామికం అన్నారు కూనంనేని. ఎక్కడో జిల్లాల్లో నిరసనలు తెలియజేస్తే మోడీ కి హాని జరుగుతుందా? అన్నారు. నిరసన తెలియచేయడం పౌరుల ప్రజాస్వామిక హక్కు అని తక్షణమే అరెస్ట్ చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -