మీడియా కాదు మోడీయా: కేటీఆర్

145
modi pm
- Advertisement -

ప్రస్తుతం దేశంలో మీడియా మోడీయా మారిందన్నారు మంత్రి కేటీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనవర్సిటీ లో మీడియా అకాడమీ ఆఫ్ తెలగాణ స్టేట్ నేషనల్ సెమినార్ జరిగింది. మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రెసెంట్ ఫ్యూచర్ అంశం పై రెండు రోజుల జాతీయ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ , అకాడమీక్ డైరెక్టర్ ప్రో.గంట చక్రపాణి ,FCC చైర్ అడ్వైసరి కమిటీ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ న్యూ ఢిల్లీ ఎస్.వెంకట నారాయణ్ తదితరులు పాల్గొన్నారు….

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… మా నాన్న నేర్పిన కొన్ని అలవాటు లలో పేపర్ చదవడం ఒకటి అన్నారు. రోజుకి 13 పేపర్ లు చదవటం అలవాటు…వార్త ఏదో వాస్తవమో తెలుసుకోడానికి చదువుతున్న అన్నారు. వార్తల్లో పత్రిక రీడర్స్,యాజమాన్యం కోణం లో 5రకాల మనుషులు కనిపిస్తారు…స్పోర్ట్స్,సినిమా,బిజినెస్,క్రిమినల్,పొలిటీషియన్ స్టార్ లు కనిపిస్తున్నారన్నారు. వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే…తరవాత మన సమర్థతే మనల్ని నిలబెడుతుందన్నారు.

మీడియా కంటే కూడా మీడియా లో పనిచేసిన కాలం వీరుల పనితనం గొప్పదన్నారు. నిజాం కాలం లో షోయబ్ ఉల్లాఖన్,గోల్కొండ పత్రిక నడిపిన సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరులతో నైతిక బలం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లో TRS పార్టీ పెట్టిన సమయం లో మాకు డబ్బు సపోర్ట్,మీడియా సపోర్ట్ లేదన్నారు. NTR పార్టీ పెట్టినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదన్నారు. కెసిఆర్ పార్టీ పెట్టిన సమయం లో మీడియా యాజమాన్యం సపోర్ట్ లేదు అన్నారు. కానీ మీడియా లో ఉన్న జర్నలిస్తులే మాకు సపోర్ట్ గ నిలబడ్డారన్నారు.

అప్పుడు మాకు సపోర్ట్ గ నిలిచిన చాలా మంది జర్నలిస్టులను సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకున్నం అన్నారు.దేశంలో ఎక్కడ లేని జర్నలిస్ట్ సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. సంక్రాంతి తర్వత మీడియా అకాడమీ బిల్డింగ్ ఓపెన్ చేసుకుంటాం…సిటీలో వర్షం వచ్చినప్పుడు వార్తలు చూస్తే మొత్తం మునిగినట్టు అనిపిస్తుందన్నారు. వార్తలు చూస్తే ఇప్పుడు ఏది వార్త… ఏది వాస్తవం అర్థం కావడం లేదన్నారు. ఈ దేశం లో మీడియా మోడియ గా మారిపోయిందన్నారు. 8ఏళ్లుగా మన్ కి బాత్ తప్ప…మీడియా తో మాట్లాడిన సందర్భ ఉందా అని ప్రశ్నించారు.

 ఇవి కూడా చదవండి..

- Advertisement -